Kadiri: వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ.. లోకేష్ రాజీనామాకు డిమాండ్!

Kadiri: డీఎస్సీ-2025 బాధితులకు న్యాయం చేయాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ.

P.RAHAMTULLA, KADIRI
Published on: 10 Aug 2026 4:30 PM IST
Kadiri
X

Kadiri: వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ.. లోకేష్ రాజీనామాకు డిమాండ్!

కదిరి: డీఎస్సీ–2025 భాధిత అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నిరుద్యోగ భృతిని అమలు చేయాలని, విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కదిరిలో వైఎస్సార్ సీపీ భారీ ర్యాలీ నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలపై భాద్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజినామా చేయాలనీ డిమాండ్ చేశారు

ర్యాలీ & నిరసన కార్యక్రమం చేస్తున్న వైస్సార్సీపీ నాయకులను వైసీపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నా.. వైసీపీ శ్రేణులు ర్యాలీనీ విజయవంతం చేశారు.

వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు కదిరి వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్.మక్బుల్ ఆధ్వర్యంలో చేస్తున్న ర్యాలీ మరియు నిరసన కార్యక్రమనికి పోలీసులు అడ్డగించి రూటు మార్చారు.అయినా పట్టువిడువకుండా, వైస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున కూటమి ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వరకూ వెళ్లి తహసీల్దార్ కు వినతిపత్రం అందచేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్. బాబ్జాన్,రాష్ట్ర ఆర్గనైజషన్ ఆక్టివిటీ సెక్రటరీ వజ్రభాస్కర్ రెడ్డి,రాష్ట్ర విద్యార్ధి విభాగం ప్రధాన కార్యదర్శి వల్లమ్ రాజేంద్ర యాదవ్, టౌన్ విద్యార్ధి విభాగం ప్రెసిడెంట్ సాయి నిఖిల్ రెడ్డి,రూరల్ మండలం కన్వీనర్ మణికంఠ

,ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి,నల్లచెరువు మండల కన్వీనర్ మొండెం రవికుమార్ రెడ్డి, తనకల్లు మండల కన్వీనర్ మబ్బు అశోక్ వర్ధన్ రెడ్డి,గాండ్లపెంట మండల కన్వీనర్ గజ్జల రవీందర్ రెడ్డి, N. P. కుంట మండల కన్వీనర్ రంగారెడ్డి, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి జైనుల్లా, రాష్ట్ర పంచాయతీ రాజ్ సెక్రటరీ పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైస్ కన్వీనర్ లు తాజా మాజి కౌన్సిల్లర్ లు, మాజి సర్పంచ్ లు,జడ్పీటీసీ లు,ఎంపీటీసీ లు, వైస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story