Pamidi: వైసిపి నేత చెన్నకేశవరెడ్డికి నైరుతి రెడ్డి పరామర్శ!

Pamidi: ప్రమాదవశాత్తు గాయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చెన్నకేశవరెడ్డిని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి, జానకిరామిరెడ్డి పరామర్శించారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 16 July 2026 4:21 PM IST
Pamidi
X

Pamidi: వైసిపి నేత చెన్నకేశవరెడ్డికి నైరుతి రెడ్డి పరామర్శ!

పామిడి: అనంతపురం జిల్లా పామిడి: ప్రమాదవశాత్తు కిందపడి స్వల్ప గాయాలతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పామిడి చెన్నకేశవరెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతి రెడ్డి మరియు జానకిరామిరెడ్డి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. పార్టీ ఎల్లవేళలా ఆయనకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పామిడి - గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని చెన్నకేశవరెడ్డి గారికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story