Pamidi: పామిడిలో నూతన ట్రాక్టర్ను ప్రారంభించిన చెన్నకేశవరెడ్డి!
Pamidi: పామిడి పట్టణం 3వ వార్డులో వైఎస్సార్సీపీ నేత నారాయణస్వామి కొనుగోలు చేసిన నూతన ట్రాక్టర్ను జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ చెన్నకేశవరెడ్డి ప్రారంభించారు.
Pamidi: పామిడిలో నూతన ట్రాక్టర్ను ప్రారంభించిన చెన్నకేశవరెడ్డి!
పామిడి, సెప్టెంబర్ 14: పామిడి పట్టణం 3వ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బట్టి సూరి అన్న నారాయణస్వామి నూతన ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ, పామిడి పట్టణానికి చెందిన చెన్నకేశవరెడ్డి రిబ్బన్ కట్ చేసి ట్రాక్టర్ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పామిడి పట్టణ కన్వీనర్ నాగూర్ ఈశ్వర్ రెడ్డి, అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పామిడి సూరి వాల్మీకి, పామిడి పట్టణ ఉపాధ్యక్షుడు, మైనార్టీ నాయకుడు తుల్లాభాయ్, జనార్దన్ రెడ్డి, 3వ వార్డు నాయకుడు రజాక్, మాజీ సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
అలాగే రజాక్ కుమారులు లాల్ బాషా, హరి మహారాజ్తో పాటు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొని నారాయణస్వామికి అభినందనలు తెలిపారు. నూతన ట్రాక్టర్ ద్వారా వ్యవసాయ పనులకు మరింత ఉపయోగం చేకూరుతుందని, నారాయణస్వామి భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకాంక్షించారు.




