Kadiri: కదిరి వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు ఘనం

Kadiri: కదిరిలో వైఎస్సార్ జయంతి వేడుకలు. వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించిన యువ నాయకుడు బి.ఎస్. మక్బూల్. జగనన్నను మరోసారి సీఎంను చేసుకుందామని పిలుపు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 8 July 2026 8:48 PM IST
Kadiri
X

Kadiri: కదిరి వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు ఘనం

కదిరి: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని కదిరి నియోజకవర్గ యువ నాయకుడు బి. ఎస్ మక్బూల్ అన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా కదిరి మున్సిపాలిటీ నందు వైఎస్సార్ విగ్రహాలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులర్పించారు.

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు.

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం ఆయన అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఆరోగ్యం, విద్య, సాగునీటి రంగాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పనిచేసిన గొప్ప నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. ఆయన ఆశయాలు, ఆదర్శాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. వైఎస్సార్ సంక్షేమ పాలనను మరోసారి రాష్ట్రంలో తీసుకురావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేసి ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల &టౌన్ కన్వీనర్లు పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా అనుబంధ సంఘాల నాయకులు, నియోజకవర్గ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story