Mullolapalli: ఎమ్మెల్యే కందికుంట ఉదారత.. సొంత నిధులతో బోరు వేయించి నీటి తిప్పలు తీర్చిన నేత!

Mullolapalli: శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముల్లోలపల్లిలో తాగునీటి ఎద్దడి తీర్చిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.

P.RAHAMTULLA, KADIRI
Published on: 27 July 2026 11:04 AM IST
Mullolapalli
X

Mullolapalli: ఎమ్మెల్యే కందికుంట ఉదారత.. సొంత నిధులతో బోరు వేయించి నీటి తిప్పలు తీర్చిన నేత!

తనకల్లు (శ్రీ సత్యసాయి జిల్లా): సత్యసాయి జిల్లా తనకల్లు మండలం, దిగువతొట్లిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ముల్లోలపల్లి గ్రామంలో తాగునీటి సమస్య ఉందని స్థానిక ప్రజలు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గ్రామ ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తన సొంత నిధులతో ఆఘమేఘాలపై బోరు వేయించారు. నీరు పుష్కలంగా పడడంతో గ్రామస్తుల ఆనందంతో గంతులు వేశారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story