Anantapur: ఓటర్ల జాబితా సవరణపై కలెక్టర్ ఆనంద్ కీలక ఆదేశాలు!

Anantapur: అనంతపురం జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కోసం జూలై 14 లోగా ఎఫ్-ఫారం సమర్పించాలని, లేనిపక్షంలో ఓటు తొలగిస్తారని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 7 July 2026 10:31 PM IST
Anantapur
X

Anantapur: ఓటర్ల జాబితా సవరణపై కలెక్టర్ ఆనంద్ కీలక ఆదేశాలు!

అనంతపురం: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని, గడువులోగా నిర్దేశిత ఫారాలను సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు.

ఓటర్లు తమ ఎఫ్-ఫారాన్ని (F-Form) జూలై 14వ తేదీ లోగా సంబంధిత బూత్ స్థాయి అధికారులకు (BLO) తప్పకుండా అందజేయాలి.ఒకవేళ 2002 నాటి పాత వివరాలు అందుబాటులో లేకపోయినప్పటికీ ఓటర్లు తమ ప్రస్తుత చిరునామాతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

పూర్తిగా పూరించిన ఎఫ్-ఫారాన్ని మీ పరిధిలోని సంబంధిత బీఎల్ఓ (BLO)కు మాత్రమే అందజేయాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.జిల్లాలోని అర్బన్ (పట్టణ) ప్రాంతాల్లో ఇప్పటికే 45 శాతం ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని కలెక్టర్ వెల్లడించారు.స్థానికంగా లేని నాన్-లోకల్ ఓటర్లు తమ పేర్ల నమోదు కోసం ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఓటర్లు అందుబాటులో ఉన్న రెండు ఫారాల్లో ఏదో ఒక దాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఒకవేళ నిర్దేశిత గడువులోగా ఎఫ్-ఫారం ఇవ్వకపోతే, అటువంటి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించే అవకాశం ఉంది అని కలెక్టర్ ఆనంద్ తెలిపారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story