Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసుల నైట్ పెట్రోలింగ్: నేరగాళ్లకు ఇక చుక్కలే!

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం. రాత్రి వేళల్లో గస్తీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.

S.Firoz, Sri Sathya Sai
Published on: 11 Jun 2026 11:49 AM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసుల నైట్ పెట్రోలింగ్: నేరగాళ్లకు ఇక చుక్కలే!

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని పోలీసులు విస్తృతంగా కొనసాగిస్తున్నారు. రాత్రి వేళల్లో గ్రామాలను సందర్శించి బాల బాలికల భద్రత ,నేరాల నియంత్రణ సైబర్ మోసాలు వంటి వాటిపై పోలీసు అధికారులు సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా నేరాల నియంత్రణతో పాటు అనుమానాస్పద వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. సోమవారం రాత్రి నుండి తెల్లవారు జాము వరకు జిల్లావ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు. అనుమానితుల వేలిముద్రలను సేకరించారు. డ్రంక్ & డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.

ఏటీఎం కేంద్రాల వద్ద , ప్రముఖ దేవాలయ ప్రాంతాలలో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. రహదారి ప్రమాదాల నివారణకు “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112 కు లేదా డయల్ 100కు గాని సమాచారం ఇవ్వాలని సూచించారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story