Kasapuram: నెట్టికంటి ఆంజనేయస్వామి క్షేత్రంలో శ్రావణ శుక్రవార పూజలు!

Kasapuram: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం సెప్టెంబర్ 4న నిర్వహణ అని ఈవో విజయరాజు వెల్లడి

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 4 Sept 2026 1:35 PM IST
Kasapuram
X

Kasapuram: నెట్టికంటి ఆంజనేయస్వామి క్షేత్రంలో శ్రావణ శుక్రవార పూజలు!

Kasapuram: కసాపురం (గుంతకల్లు మండలం, అనంతపురం జిల్లా): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానం, కసాపురంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.

శ్రావణమాసం చివరి శుక్రవారం అయిన తేది 04-09-2026 న ఉదయం 10-00 గంటల నుండి ఆలయంలో మహిళా భక్తుల సౌభాగ్యం కొరకు ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని దేవస్థాన వేదపండితులు, అర్చకులతో నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి విజయరాజు మేడేపల్లి తెలిపారు.

వ్రత రుసుము రూ. 2000/- చెల్లించిన భక్తులకు, మహిళామణులకు దేవస్థానం తరపున పూజా సామాగ్రిగా కొబ్బరికాయ, గాజులు, రవిక, తాంబూలంతో పాటు పట్టుచీర, 80 గ్రాముల లడ్డూ ప్రసాదం, స్వామి వారి ప్రత్యేక దర్శనం, స్వామి వారి శేష వస్త్రంతో పాటు అన్నప్రసాద వితరణ కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల మహిళలు, భక్తులు రూ. 2000/-లు చెల్లించి ఈ సామూహిక వరలక్ష్మీ వ్రత కార్యక్రమంలో పాల్గొనగలరని ఆలయ అధికారులు కోరారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story