Uravakonda: ఉరవకొండలో లారీ బోల్తా.. పులివెందుల డ్రైవర్ సజీవ దహనం!
Uravakonda: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద ఘోర ప్రమాదం. చెట్టును ఢీకొట్టి బోల్తా పడిన గ్రానైట్ లారీ.
Uravakonda: ఉరవకొండలో లారీ బోల్తా.. పులివెందుల డ్రైవర్ సజీవ దహనం!
పులివెందుల: బళ్లారి నుంచి నెల్లూరుకు గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ ఉరవకొండ మండలం బూదగవి వద్ద శుక్రవారం తెల్లవారుజామున అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తాపడింది. ప్రమాదం అనంతరం లారీకి మంటలు అంటుకోవడంతో పులివెందుల నియోజక వర్గంలోని లింగాల మండలం కర్ణ పాపాయ పల్లె గ్రామానికి చెందిన ఆలవలపాటి ఓబుల్ రెడ్డి అనే డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు.
క్లీనర్ పుల్లయ్య ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న విడపన కల్లు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న బంధువులు హుటా హుటిన సంఘటన స్థలంకు చేరుకున్నారు.
Next Story




