Anantapur: గుంతకల్లు 37వ వార్డులో నిలిచిపోయిన డ్రైనేజీ పనులు!

Anantapur: అనంతపురం జిల్లా గుంతకల్లు 37వ వార్డులో నిలిచిపోయిన మురికి కాలువ నిర్మాణం. ట్రాన్స్‌ఫార్మర్ పక్కనే నిల్వ ఉన్న మురికి నీటితో నిత్యం భయాందోళనలో ప్రజలు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 22 Aug 2026 9:35 AM IST
Anantapur
X

Anantapur: గుంతకల్లు 37వ వార్డులో నిలిచిపోయిన డ్రైనేజీ పనులు!

Anantapur: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మోదినాబాద్ 37వ వార్డు సుంకులమ్మ గుడి ఆపోజిట్ లైన్ లో మురికి కాలువ సమస్య తీవ్రంగా ఉందని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపాలిటీ వారు కాలువ నిర్మాణాన్ని సగంలోనే నిలిపివేశారని, అక్కడ ప్రైవేటు ప్లాట్లు ఉండటంతో యు-టర్న్ తీసుకునే అవకాశం ఉన్నా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో కాలువ నీరు ముందుకు వెళ్లక గుంతలు ఏర్పడి నిల్వ ఉంటోంది.

అంతేకాకుండా మురికి కాలువ పక్కనే కరెంటు ట్రాన్స్ ఫార్మర్ ఉండటంతో మురికి నీళ్ల వల్ల ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని వార్డు ప్రజలు భయం వ్యక్తం చేస్తున్నారు. నిల్వ ఉన్న మురికి నీటి వల్ల పందులు, దోమలు విపరీతంగా పెరిగి రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు.

ఈ సమస్యపై చాలాసార్లు వార్డు ప్రజలు మున్సిపాలిటీ అధికారులకు కంప్లైంట్ చేసి లెటర్లు పెట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదని, కాలువను పట్టించుకునే నాథుడే లేడని వార్డు ప్రజలు విన్నవించుకుంటున్నారు. దయచేసి మురికివాడలను పరిశీలించి ప్రజల సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని వార్డు ప్రజలు తెలియజేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి 37వ వార్డు మురికి కాలువ సమస్యను పరిష్కరించాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story