Anantapur: అడవి పందిని తప్పించబోయి కారు బోల్తా, ఇద్దరు మృతి!

Anantapur: అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి శివారులో అడవి పందిని తప్పించబోయి కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాలు.

P.Sudhakar, Anantapuram
Published on: 27 Aug 2026 12:24 PM IST
Anantapur
X

Anantapur: అడవి పందిని తప్పించబోయి కారు బోల్తా, ఇద్దరు మృతి!

Anantapur: బెలుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి శివారులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపైకి వచ్చిన అడవి పందిని తప్పించబోయే క్రమంలో కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన కోమటి నాగరాజు, కోమటి గుప్తా, బలిజ నరహరి, కోమటి హర్ష నలుగురు తమ సొంత పనుల నిమిత్తం కర్ణాటకలోని చిక్కమగళూరుకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో రాయదుర్గం–అనంతపురం ప్రధాన రహదారిపై బ్రాహ్మణపల్లి శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అడవి పందిని తప్పించబోయే క్రమంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోమటి నాగరాజు (55), కోమటి గుప్తా (45) అక్కడికక్కడే మృతి చెందారు. కోమటి గుప్తా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం.

కారులో ప్రయాణిస్తున్న బలిజ నరహరి, కోమటి హర్ష లకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నాగరాజు కళ్యాణదుర్గం పట్టణంలో వస్త్ర వ్యాపారిగా సుపరిచితుడు కాగా, గుప్తా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నారు. ఇద్దరి మృతితో కళ్యాణదుర్గం పట్టణంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

P.Sudhakar, Anantapuram

P.Sudhakar, Anantapuram

Next Story