Guntakal: గుంతకల్లులో ఓటర్ల జాబితా సవరణ ‘SIR-2026’ వేగవంతం

Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు 15వ వార్డు సచివాలయంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR-2026) ప్రక్రియను టీడీపీ కార్యదర్శి హిమబిందు పరిశీలించారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 29 Jun 2026 3:22 PM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లులో ఓటర్ల జాబితా సవరణ ‘SIR-2026’ వేగవంతం

Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం గారు మరియు గుంతకల్లు మండల ఇన్‌చార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణస్వామి గారి ఆదేశాల మేరకు, గుంతకల్లు పట్టణంలోని 15వ వార్డు సచివాలయంలో BLOలు నిర్వహిస్తున్న SIR (Special Intensive Revision)-2026 తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ పత్తి హిమబిందు గారు పరిశీలించారు.

ఈ సందర్భంగా 15వ వార్డు సచివాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి, ఓటరు జాబితాను పరిశీలించారు. అలాగే SIR-2026 కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం, ప్రాముఖ్యతపై ఓటర్స్ కు అవగాహన కల్పిస్తూ, ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచించారు.

అనంతరం ఎన్యూమరేషన్ ఫారంను ఎలా సరిగ్గా పూరించాలి, ఫారంతో పాటు సమర్పించాల్సిన అవసరమైన పత్రాలు (Documents) ఏమిటి, వాటిని సంబంధిత BLOకు ఎలా సమర్పించాలి అనే అంశాలపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ పత్తి హిమబిందు గారు స్వయంగా వివరించి అవగాహన కల్పించారు. ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి, అవసరమైన పత్రాలను జత చేసి నిర్ణీత గడువులోపు సంబంధిత BLOకు సమర్పించాలని ఓటర్లకు సూచించారు.

అలాగే BLOలు కూడా ప్రతి ఓటరికి SIR-2026 కార్యక్రమంపై పూర్తి అవగాహన కల్పించి, ఫారాలు నింపే విధానం, అవసరమైన పత్రాలు, సమర్పణ ప్రక్రియపై స్పష్టమైన సూచనలు అందించి, ప్రతి అర్హత కలిగిన ఓటరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకునేలా సహకరించాలని సూచించారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story