Anantapur: వైఎస్ కుటుంబానికి దశాబ్దాల నేరచరిత్ర ఉంది.. శ్రీనివాసులు
Anantapur: వైఎస్ కుటుంబానికి ఆరు దశాబ్దాల నేరచరిత్ర, మూడు తరాల రక్తచరిత్ర ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Anantapur: వైఎస్ కుటుంబానికి దశాబ్దాల నేరచరిత్ర ఉంది.. శ్రీనివాసులు
Anantapur: వైఎస్ కుటుంబానికి ఆరు దశాబ్దాల నేరచరిత్ర, ముగ్గురు వ్యక్తుల రక్తచరిత్ర ఉందని ప్రభుత్వ విప్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్లేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.
రాజారెడ్డి కాలం నుంచే దౌర్జన్యాలు
రాజారెడ్డి కాలం నుంచి దౌర్జన్యాలు, హత్యలు చేయడమే వైఎస్ కుటుంబ చరిత్ర. రాజారెడ్డి చేసిన నేరాలపై ఏకంగా ఒక పెద్ద పుస్తకమే రాయవచ్చు. వీరి నేరచరిత్ర పులివెందల నుంచి హైదరాబాద్ వరకు విస్తరించింది.గతంలో ఎన్నికల సమయంలోనూ అనేక హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని, పోలీసులపై సైతం దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయని కాలువ శ్రీనివాసులు గుర్తు చేశారు. కడపలో వీరి అరాచకాలను చూసి, 1990లోనే పౌరహక్కుల సంఘం నాయకులు ‘పాలేగాళ్ల రాజ్యం’ అంటూ వైఎస్ కుటుంబ నేర చరిత్రను ప్రచురించారని కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మూడు తరాల నేరాలకు, ఘోరాలకు వైఎస్ కుటుంబమే సజీవ సాక్ష్యమని ఆయన విమర్శించారు.
వైఎస్ఆర్ హయాంలో పరిటాల రవి హత్య
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే.. ప్రముఖ టీడీపీ నాయకుడు పరిటాల రవిని అతి దారుణంగా హత్య చేశారని ధ్వజమెత్తారు. పరిటాల రవితో పాటు దాదాపు 56 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు.
2008లో మొద్దు శీనును జైలులోనే హత్య చేయించి, ఆ నిందను ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు.ఇన్ని అరాచకాలు, హత్యల నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తానేదో చాలా మంచివాడినంటూ ప్రజల ముందు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని కాలవ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజలు వైఎస్ కుటుంబం అసలు రంగును గుర్తించాలని కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.




