Guntakal: సీఎం చంద్రబాబుకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన ఎమ్మెల్యే!
Guntakal: తెదేపా అధ్యక్షుడు పూల నాగరాజు కుమారుడి వివాహానికి హాజరై ఆశీర్వదించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విజయవాడలో కలసి ఆహ్వానించారు.
Guntakal: సీఎం చంద్రబాబుకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన ఎమ్మెల్యే!
గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం కుటుంబ సమేతంగా మరియు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పూల నాగరాజు కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈనెల 30వ తేదీన జరగబోయే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుమార్తె మరియు జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు కుమారుడి వివాహ శుభకార్యానికి కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని సీఎం చంద్రబాబు గారిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానాన్ని స్వీకరించి, వివాహం జరిగే వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు, గుత్తి మరియు పామిడి ఇన్చార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ , పూల నాగరాజు కుటుంబ సభ్యులు మరియు గుమ్మనూరు జయరాం గారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




