Sri Sathya Sai: తలుపుల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ!

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రెండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భవతులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జరిగింది.

P.RAHAMTULLA, KADIRI
Published on: 12 Aug 2026 8:31 PM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: తలుపుల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ!

శ్రీ సత్యసాయి: శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం కేంద్రంలో ఉన్న ప్రాథమిక వైద్యశాలలో ఫ్రెండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఫ్రెండ్స్ ట్రస్ట్ ఫౌండర్ షేక్ మన్సూర్ ఆహ్వానం మేరకు ఆర్.డి.టి. ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ తలుపుల మండలానికి విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయనకు ఫ్రెండ్స్ ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తలుపుల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మాంచో ఫెర్రర్ ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. పేదలు, నిరుపేదలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు.

ఫ్రెండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ప్రజలకు సేవ చేయడంలో తమ వంతు సహకారం అందిస్తామని మాంచో ఫెర్రర్ తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ట్రస్ట్ ఫౌండర్ షేక్ మన్సూర్ తెలిపారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story