Tadipatri: తాడిపత్రిలో వేడెక్కిన రాజకీయం అడిషనల్ ఎస్పీకి వైసీపీ ఫిర్యాదు

Tadipatri: తాడిపత్రిలో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ జిల్లా అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 27 July 2026 7:58 PM IST
Tadipatri
X

Tadipatri: తాడిపత్రిలో వేడెక్కిన రాజకీయం అడిషనల్ ఎస్పీకి వైసీపీ ఫిర్యాదు

తాడిపత్రి: అనంతపురం జిల్లాలో సమీపిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంతో తాడిపత్రి రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసేలా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ నాయకులు జిల్లా అడిషనల్ ఎస్పీ మహబూబ్ బాషాకు ఫిర్యాదు చేశారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి తరచూ "తన టార్గెట్ లో 24 మంది ఉన్నారు... వారిని వదిలే ప్రసక్తే లేదు" అని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని, తాడిపత్రి నియోజకవర్గంలోని పలు మండలాల పరిధిలోని వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.

గ్రామాల్లో ఎలాంటి కక్షలు, కార్పణ్యాలు లేకపోయినా... కేవలం తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి, అధికార దాహంతో పోలీసులను అడ్డుపెట్టుకుని స్థానిక టిడిపి నాయకులను రెచ్చగొడుతూ వైసీపీ కార్యకర్తలపై దాడులకు పంపుతున్నారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story