Ananthapur: శెట్టూరు ఎస్సీ హాస్టల్ వద్ద ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి
Ananthapur: అనంతపురం జిల్లా శెట్టూరు ఎస్సీ హాస్టల్ వద్ద ప్రమాదవశాత్తు ప్రహరీ గోడ కూలి 8వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ మృతి. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు.
Ananthapur: శెట్టూరు ఎస్సీ హాస్టల్ వద్ద ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి
Ananthapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహం వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. హాస్టల్ సమీపంలోని పాత భవనం వద్ద ప్రహరీ గోడ కూలడంతో 8వ తరగతి విద్యార్థి మృతి చెందాడు.
ఆదివారం సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో హాస్టల్ పక్కన ఉన్న పాత భవనం వద్ద ఇద్దరు విద్యార్థులు ఆడుకునేందుకు వెళ్లారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు పాత ప్రహరీ గోడ కూలింది. గోడ కూలడంతో కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లి గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి ఎం. హర్షవర్ధన్ తేజ్ మృతి చెందాడు.
ఈ ప్రమాదంలో శెట్టూరు మండలం బసాపురం గ్రామానికి చెందిన మరో 8వ తరగతి విద్యార్థి ఎం. అక్షయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని కాలు విరగడంతో తొలుత కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.
ఘటన జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం సూచనల మేరకు పోలీసులు, రెవెన్యూ, సంబంధిత అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి హర్షవర్ధన్ మృతితో శెట్టూరు మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.




