Kadiri: గ్రూప్స్, సివిల్స్ అభ్యర్థుల కోసం స్టడీ సర్కిల్ కలెక్టర్!

Kadiri: వివేకానంద యూత్ డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్ కొత్త భవనాన్ని కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 4 July 2026 4:05 PM IST
Kadiri
X

Kadiri: గ్రూప్స్, సివిల్స్ అభ్యర్థుల కోసం స్టడీ సర్కిల్ కలెక్టర్!

కదిరి: జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ, కదిరి ఎమ్మెల్యే గౌ. శ్రీ కందికుంట వెంకటప్రసాద్ సహకారంతో ఎస్.టి.ఎస్.ఎన్. డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన వివేకానంద యూత్ డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్ ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జిల్లా విద్యాశాఖాధికారి, పలువురు విద్యాధికారులు, అధ్యాపకులు హాజరయ్యారు. పోటీ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆసక్తితో ఈ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేశారు.

గ్రూప్స్, సివిల్స్‌తో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు మార్గదర్శకత్వం, అధ్యయన వనరులు, నిపుణుల సలహాలు ఒకే వేదికపై అందేలా ఈ స్టడీ సర్కిల్‌ను రూపొందించారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే గౌ. శ్రీ కందికుంట వెంకటప్రసాద్, కదిరి నియోజకవర్గ యువతకు నాణ్యమైన అవకాశాలు కల్పించేందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. జిల్లా కలెక్టర్ తీసుకొచ్చిన ఈ వినూత్న ఆలోచనకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా సివిల్స్, గ్రూప్స్ వంటి అత్యున్నత పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

స్వామి వివేకానంద ఆశయాలను యువత ఆచరణలో పెట్టాలని, లక్ష్యసాధనలో క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర కృషి ఎంతో అవసరమని ముఖ్య అతిథులు విద్యార్థులకు సూచించారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story