Sri Sathya Sai: ఓ.డి.చెరువు మండలంలో విషాదం - బావిలో పడి మహిళ మృతి!

Sri Sathya Sai: ఓ.డి.చెరువు మండలం నల్లచెరువుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. టమోటా పంట చూసేందుకు వెళ్లిన లక్కసాని ఉషారాణి బావిలో పడి ప్రమాదవశాత్తు మృతి చెందింది.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 4 Sept 2026 2:25 PM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: ఓ.డి.చెరువు మండలంలో విషాదం - బావిలో పడి మహిళ మృతి!

Sri Sathya Sai: మండల పరిధిలోని నల్లచెరువుపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావి వద్ద టమోటా పంటను పరిశీలించేందుకు వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది.గ్రామానికి చెందిన లక్కసాని ఉషారాణి (37), భర్త ప్రతాప్‌రెడ్డితో కలిసి పంటను చూసేందుకు బావి వద్దకు వెళ్లారు.

అనంతరం భర్త వేరే పనిపై వెళ్లి ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ ఉషారాణి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బావి వద్దకు వెళ్లి గాలించారు. ఈ క్రమంలో ఆమె బావిలో మృతి చెందినట్లు గుర్తించారు. ఉషారాణికి అప్పుడప్పుడు మూర్ఛ వచ్చే సమస్య ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆమె ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయి మృతి చెందినట్లు భావిస్తున్నామని, ఘటనపై తమకు ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని మృతురాలి తండ్రి సోమశేఖర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఓ.డి.చెరువు పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story