Nallamada: విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన ఆరోపణలు.. ఉపాధ్యాయుడు సస్పెండ్

Nallamada: శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ కురుమాల జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు రత్నరాజు సస్పెండ్.

S.Firoz, Sri Sathya Sai
Published on: 24 July 2026 3:57 PM IST
Nallamada
X

Nallamada: విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన ఆరోపణలు.. ఉపాధ్యాయుడు సస్పెండ్

నల్లమాడ: నల్లమాడ మండలం కురుమాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడిపై విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలు రావడంతో తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ అధికారులు సంబంధిత ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు రత్నరాజుపై ఆరో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. జరిగిన విషయాన్ని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు పోలీసులు పాఠశాలకు వెళ్లి విద్యార్థుల నుంచి వివరాలు సేకరించి, ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో విద్యాశాఖ అధికారులు కూడా ప్రాథమిక విచారణ చేపట్టారు.

విచారణలో ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లభించిన నేపథ్యంలో ఉపాధ్యాయుడు రత్నరాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు, విద్యాశాఖ అధికారులు విడివిడిగా సమగ్ర విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ నివేదికల ఆధారంగా నిందితుడిపై తదుపరి చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story