Tanakallu: తనకల్లు హత్య కేసును చేదించిన పోలీసులు 5గురు అరెస్ట్
Tanakallu: శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం పడమటవారిపల్లిలో జరిగిన హత్య కేసును చేదించి జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు నిందితులను రిమాండ్‌కు తరలించిన పోలీసులు.
Tanakallu: తనకల్లు హత్య కేసును చేదించిన పోలీసులు 5గురు అరెస్ట్
తనకల్లు: శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం పడమటవారిపల్లిలో గత వారం రోజుల క్రితం జరిగిన హత్య కేసును తనకల్లు పోలీసులు చేదించి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 5 మంది నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు.
కదిరి రూరల్ సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ శివ నారాయణ స్వామి వివరాలు వెల్లడిస్తూ చీకటిమానుపల్లి వద్ద ఉన్న ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఉపాధి కోసం కొందరు జార్ఖండ్ వాసులు పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని,మంద్రాజ్ థతేరా అనే వ్యక్తి తన భార్యను వేధిస్తుండడంతో అతన్ని చంపేయాలన్న ఉద్దేశ్యంతో మృతుడి భార్య కుటుంబ సభ్యులు పథకం ప్రకారం అతనికి ఫుల్లుగా మద్యం తాపి హత్య చేసి అనంతరం మృతదేహాన్ని ఫ్యాక్టరీ సమీపంలోని పొలంలో పడేశారని డిఎస్పీ తెలిపారు.
మృతుడితోపాటు హత్య చేసిన వారంతా జార్ఖండ్ వాసులేననీ డి.ఎస్.పి నిందితుల పేర్లు వెల్లడించారు.వారిలో సునీల్ సితారై, సంజీవ్ సితారై, సింగా సితారై, బాసు బల్ముచ్ లుగా పోలీసులు తెలిపారు.




