Sri Sathya Sai: మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్ ర్యాలీ

Sri Sathya Sai: మహిళలు, చిన్నారుల భద్రతపై శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా శక్తి టీమ్ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.

S.Firoz, Sri Sathya Sai
Published on: 10 Sept 2026 5:48 PM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్ ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లా: మహిళలు, చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని శక్తి టీమ్ సభ్యులు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గురువారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శక్తి టీమ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో శక్తి టీమ్ సిబ్బంది పాల్గొని విద్యార్థులు, ప్రజలకు మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా POCSO చట్టం, బాల్య వివాహాల నివారణ, సైబర్ భద్రత తదితర అంశాలపై వివరించారు.

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించేందుకు 100, 112, 1091, 1098, 181 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై వేధింపులు, హింస లేదా అనుమానాస్పద ఘటనలు జరిగినప్పుడు ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

“మహిళలు, చిన్నారుల రక్షణ కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు.. సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత” అని శక్తి టీమ్ సభ్యులు అవగాహన కల్పించారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story