Puttaparthi: సత్యసాయి జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ ₹84 లక్షల సొత్తు స్వాధీనం!
Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు.
Puttaparthi: సత్యసాయి జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ ₹84 లక్షల సొత్తు స్వాధీనం!
Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా వ్యాప్తంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను అరెస్టు చేసిన పోలీసులు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎదుట హాజరు పరిచిన సి కే పల్లి పోలీసులు.
జిల్లాలోని ధర్మవరం, గోరంట్ల, పుట్టపర్తి ,బుక్కపట్నం , సి కే పల్లి ప్రాంతాలలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు. అతని వద్ద నుండి 47 తులాల బంగారు నగలు, కేజీ వెండి మొత్తం 84 లక్షల రూపాయల విలువ చేసే సొత్తును స్వాధీనం చేస్తున్న పోలీసులు.
జిల్లా వ్యాప్తంగా ప్రజలు దొంగల పట్ల ప్రమాదంగా ఉండాలని అపరిచితులు కనపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న ఎస్పీ.
జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కామెంట్స్..
జిల్లాలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం.
అతని వద్ద నుండి బంగారు ఆభరణాలతో పాటు వెండి 84 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నాం.
దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి చిత్తూరు జిల్లా వైయస్సార్ కాలనీకి చెందిన ఒంటి పులి శ్రీనివాసులుగా గుర్తించాం. ఇతను ఈ జిల్లా నే కాకుండా తిరుపతి,చిత్తూరు ,పాకాల మదనపల్లె ,పలమరేరు, పీలేరు తదితర ప్రాంతాలలో అతనిపై 20 కేసులు నమోదు అయ్యాయి.
జిల్లాలోనీ ప్రతి ఒక్కరూ ఇంటి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు డబ్బులు,ఆభరణాలు ఇంటిలో ఉంచవద్దని లాకర్ సిస్టం ని ఏర్పాటు చేసుకోవాలని సూచించిన ఎస్పీ తీసుకోవద్దని ఎక్కడైనా వెళ్ళినట్లయితే ఏర్పాటు చేసుకోవాలని సూచించిన ఎస్పీ. దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అపరిచితులు ఎవరైనా కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న ఎస్పీ.




