Sri Sathya Sai: కేజీబీవీలో విద్యార్థినులతో మసాజ్ ఎస్ఓ, టీచర్ తొలగింపు
Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా ఎన్‌పీ కుంట కేజీబీవీలో విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న హిందీ టీచర్ రూప, ఎస్ఓ రెహనాలను విధుల నుంచి తొలగించిన జిల్లా అధికారులు.
Sri Sathya Sai: కేజీబీవీలో విద్యార్థినులతో మసాజ్ ఎస్ఓ, టీచర్ తొలగింపు
శ్రీ సత్య సాయి: శ్రీ సత్య సాయి జిల్లా ఎన్ పి కుంట కస్తూర్బా స్కూల్ ఎస్ ఓ రెహనా హిందీ టీచర్ రూప ను విధులనుండి తొలగించారు జిల్లా అధికారులు. స్కూల్లో విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న ఫోటోలతో మీడియా కథనాలు ప్రసారం కావడంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు.
జిల్లా ఉన్నతాధికారులను దీనిపై వివరణ కోరగా, జరిగిన ఘటనపై త్రిసభ్య కమిటీతో విచారణకు ఆదేశించారు. కమిటీ స్కూల్లో విచారణ చేపట్టిన అనంతరం నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపారు.
నివేదిక ఆధారంగా విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న టీచర్ రూపా తో పాటు ఎస్ఓ రెహనాను విధుల నుంచి తొలగించారు జిల్లా ఉన్నతాధికారులు.
Next Story




