Sri Sathya Sai: 'స్టాప్ - వాష్ అండ్ గో'.. రోడ్డు ప్రమాదాలకు చెక్ పెడుతున్న పోలీసులు!

Sri Sathya Sai: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు శ్రీ సత్య సాయి జిల్లా పోలీసుల సరికొత్త ప్రయత్నం.

S.Firoz, Sri Sathya Sai
Published on: 25 April 2026 9:58 AM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: 'స్టాప్ - వాష్ అండ్ గో'.. రోడ్డు ప్రమాదాలకు చెక్ పెడుతున్న పోలీసులు!

శ్రీ సత్య సాయి జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసుల వినూత్న చర్యలు చేపడుతున్నారు. “స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రతిరోజూ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేషనల్ హైవేలపై ప్రయాణిస్తున్న లారీలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, కార్లు, మినీ వ్యాన్లు, లగేజీ బొలేరో వాహనాలను పోలీసులు ఆపుతున్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్‌ల లైసెన్సులు వంటి భద్రతా ప్రమాణాలను తనిఖీ చేస్తున్నారు. అలసటతో డ్రైవింగ్‌ చేయడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేలా సూచిస్తున్నారు. అనంతరం సురక్షితంగా ప్రయాణం కొనసాగించేందుకు అనుమతిస్తున్నారు. అదేవిధంగా, అతి వేగం వద్దని, రాంగ్ రూట్‌లో ప్రయాణించకూడదని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని పోలీసులు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story