Amadagur: అమడగూరు పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
Amadagur: శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అమడగూరు పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి సేవలను అడిగి తెలుసుకున్నారు.
Amadagur: అమడగూరు పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
Amadagur: శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అమడగూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పిహెచ్‌సి లోని ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్, ల్యాబ్, ఇన్-పేషెంట్ వార్డు, లేబర్ రూమ్, మందుల నిల్వ గదిని నిశితంగా పరిశీలించారు. చికిత్స కోసం వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి, వైద్యులు అందుబాటులో ఉంటున్నారా, ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రతి రోగికీ జవాబుదారీతనంతో వైద్యం అందించాలి. ఆసుపత్రిలో ఎలాంటి మందుల కొరత లేకుండా చూసుకోవాలి. వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనీ, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వ్యాక్సినేషన్ సేవలు సక్రమంగా అందేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆమడగూరు తహశీల్దార్ మారుతి ప్రకాష్, సంబంధిత అధికారులు, పిహెచ్‌సి వైద్యాధికారి, సిబ్బంది పాల్గొన్నారు.




