Puttaparthi: బాలికల్లో ఆత్మవిశ్వాసం, సాధికారతే లక్ష్యం కలెక్టర్!

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ అధ్యక్షతన "బాలికే భవిష్యత్తు" కార్యక్రమ సన్నాహక సమావేశం జరిగింది.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 6 Aug 2026 10:31 PM IST
Puttaparthi
X

Puttaparthi: బాలికల్లో ఆత్మవిశ్వాసం, సాధికారతే లక్ష్యం కలెక్టర్!

పుట్టపర్తి: బాలికల విద్య, సాధికారత, వ్యక్తిత్వ వికాసం మరియు ఉన్నత కెరీర్ అవకాశాలపై సంపూర్ణ అవగాహన కల్పించే లక్ష్యంతో చేపడుతున్న జిల్లాస్థాయి "బాలికే భవిష్యత్తు" కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో దిగ్విజయం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్ లోని మినీ కన్ఫారెన్స్ హాలు లో ఈ కార్యక్రమ నిర్వహణ సన్నాహాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో పాటు బాలికలలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, మానసిక దృఢత్వం, భవిష్యత్ ఉపాధి కెరీర్ అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అన్నారు. మహిళా శిశు సంక్షేమం, విద్య, వైద్యారోగ్య, సంక్షేమ శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని మోడల్‌గా నిర్వహించాలి.

ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర ముఖ్య వక్తగా హాజరై విద్యార్థినులకు వ్యక్తిత్వ వికాసం, లక్ష్య సాధన, ఒత్తిడి నిర్వహణ, కెరీర్ ప్లానింగ్, ప్రేరణాత్మక అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తారనీ అన్నారు. జిల్లాస్థాయి "బాలికే భవిష్యత్తు" కార్యక్రమం 11-08-2026 తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారత శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ (ఐసీడీఎస్) ప్రమీల తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో సువర్ణ – ఆర్‌డీఓ (RDO),ప్రమీల – ప్రాజెక్టు డైరెక్టర్, మహిళా & శిశు సంక్షేమ శాఖ,కిష్టప్ప – జిల్లా విద్యాశాఖ అధికారి (DEO),డాక్టర్ ఫిరోజ్ బేగం – జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి (DM&HO),ఐ&పిఆర్ ఎడి భరత్ కుమార్ రెడ్డి,మహేష్ – జిల్లా బాలల పరిరక్షణ అధికారి (DCPO),జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మోహన్ రామ్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాజేంద్ర కుమార్ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DVEO) చెన్నకేశవ ఇతర అధికారులు పాల్గొన్నారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story