Pamidi: పామిడి దత్త పాదుకా క్షేత్రంలో ఘనంగా శ్రావణ పౌర్ణమి పూజలు!
Pamidi: అనంతపురం జిల్లా పామిడిలోని శ్రీ అనఘా ఆత్రేయ దత్త పాదుకా క్షేత్రంలో శ్రావణ శుక్రవారం, రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీచక్ర అభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా నిర్వహించారు.
Pamidi: పామిడి దత్త పాదుకా క్షేత్రంలో ఘనంగా శ్రావణ పౌర్ణమి పూజలు!
పామిడి పట్టణం: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని శ్రీ అనఘా ఆత్రేయ దత్త పాదుకా క్షేత్రంలో శ్రావణ శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి.
పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి మరియు పూజ్య శ్రీ బాల స్వామీజీ వారి దివ్య అనుగ్రహంతో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో విశేష శ్రీచక్ర అభిషేక పూజ, అర్చన, శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, మహా మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
ఈ వ్రతానికి ప్రధాన సేవాకర్తలుగా శ్రీ D.S.M. వరప్రసాద్ & ధర్మపత్ని శ్రీమతి D. విజయలక్ష్మి కుటుంబం, మరియు శ్రీ కాశంశెట్టి మంజునాథ్, శ్రీమతి K. శ్రావణి కుటుంబం సేవలు సమర్పించారు. విశేష అన్నదాన సేవాకర్తలుగా శ్రీ కుంటె కృష్ణారావు - శ్రీమతి K. ఉషాబాయి కుటుంబ సభ్యులు సేవలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ గురు దత్త సేవా సమితి కార్యవర్గ సభ్యులు, ఆలయ అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో శ్రీ దత్త భక్తులు పాల్గొని పూజ్య గురుదేవుల దివ్యానుగ్రహాన్ని పొందారు.




