Pamidi: పామిడి మండలం: భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు!

Pamidi: అనంతపురం జిల్లా పామిడి మండలం రామగిరి ఎగువ తాండాలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా తిరుపతి పండితుల ఆధ్వర్యంలో గణనాథుడికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 15 Sept 2026 9:39 PM IST
Pamidi
X

Pamidi: పామిడి మండలం: భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు!

పామిడి, సెప్టెంబర్ 15: అనంతపురం జిల్లా పామిడి మండలం రామగిరి ఎగువ తాండ గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా రెండో రోజు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి నుంచి వచ్చిన పురోహితులు ప్రసాద్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

పూజల అనంతరం భక్తులకు గణనాథుడి ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

గ్రామంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ప్రత్యేక పూజలు, దర్శన కార్యక్రమాల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL