Somandepalli: సోమందేపల్లిలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ

Somandepalli: సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో ఘనంగా చౌడేశ్వరి అమ్మవారి బోనాలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.

P.RAHAMTULLA, KADIRI
Published on: 12 Aug 2026 9:50 PM IST
Somandepalli
X

Somandepalli: సోమందేపల్లిలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ

సోమందేపల్లి: సోమందేపల్లి మండలంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ – ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.

సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో చౌడేశ్వరి అమ్మవారి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను కాపాడుకోవడంలో ఇలాంటి పండుగలు ఎంతో ముఖ్యమైనవని అన్నారు.

చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజల పై కదిరి నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story