Anantapur: అనంతపురంలో రైతుల కోసం 'సెరెంటికా' హెల్ప్‌లైన్ ప్రారంభం!

Anantapur: అనంతపురం, కర్నూలు జిల్లాల రైతుల కోసం సెరెంటికా కంపెనీ 'ఫార్మర్స్ హెల్ప్‌లైన్'ను ఏర్పాటు చేయగా, కలెక్టర్ ఓ. ఆనంద్ దీనిని ప్రారంభించారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 14 Aug 2026 2:28 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో రైతుల కోసం 'సెరెంటికా' హెల్ప్‌లైన్ ప్రారంభం!

Anantapur: భారత స్వాతంత్య్ర దినోత్సవ సంధ్య వేళ, అనంతపురం మరియు కర్నూలు జిల్లాల రైతులతో సమాచార మార్పిడిని పెంచేందుకు, పారదర్శకత మరియు నమ్మకాన్ని బలపరిచేందుకు సెరెంటికా (Serentica) కంపెనీ ఒక ప్రత్యేక 'ఫార్మర్స్ హెల్ప్‌లైన్' ను అందుబాటులోకి తెచ్చింది.

అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం రోజున జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ చేతుల మీదుగా ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెరెంటికా కంపెనీ ప్రతినిధులు తేజల ఆనంద్, రామదుర్గ అనిల్ కుమార్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

కలెక్టర్ ఓ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ "పునరుత్పాదక విద్యుత్ (Renewable Energy) ప్రాజెక్టుల కంపెనీలకు మరియు రైతులకు మధ్య ఎలాంటి సమాచార లోపం ఉండకూడదు. గతంలో రైతులు కొన్ని సమస్యలను నా దృష్టికి తీసుకురాగా, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడాను. వారు వెంటనే స్పందించి ఈ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడం అభినందనీయం.

దీనివల్ల దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా కంపెనీతో మాట్లాడవచ్చు. గాలిమరలు (Windmills), సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు సమయంలో రైతులకు ఎదురయ్యే సమస్యలు, అపోహలు తొలగించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇతర విద్యుత్ ప్రాజెక్టు కంపెనీలు కూడా ఇదే తరహాలో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయాలి." సెరెంటికా ఫార్మర్స్ హెల్ప్‌లైన్ నంబర్:

1800 309 7701 (టోల్ ఫ్రీ) ఈ హెల్ప్‌లైన్ ద్వారా రైతులకు కలిగే ఉపయోగాలు భూమి మరియు పరిహార వివరాలు భూమి కొనుగోలు లీజు అంశాలు, నష్టపరిహారం చెల్లింపుల సమాచారాన్ని నేరుగా తెలుసుకోవచ్చు. ప్రాజెక్టు నిర్మాణ వివరాలు పనుల వేళలు, పొలాల్లో వాహనాల రాకపోకల సమయాలు మరియు మార్గాల గురించి అడిగి తెలుసుకోవచ్చు.

రక్షణ & భద్రత విండ్ టర్బైన్లు, సోలార్ ప్యానెళ్ల వద్ద తీసుకుంటున్న భద్రతా చర్యల వివరాలను తెలుసుకోవచ్చు. గ్రామీణ సమస్యల పరిష్కారం ప్రాజెక్ట్ వల్ల స్థానికంగా తలెత్తే సమస్యలను కంపెనీ దృష్టికి తీసుకెళ్లవచ్చు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story