Sri Sathya Sai: పుట్టపర్తిలో ఆరాధనోత్సవాలు.. ఆకాశం నుండి నిఘా!

Sri Sathya Sai: పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి బాబా ఆరాధనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

MARUTHI, PUTTAPARTHI RURAL
Published on: 24 April 2026 10:22 AM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: పుట్టపర్తిలో ఆరాధనోత్సవాలు.. ఆకాశం నుండి నిఘా!

శ్రీ సత్య సాయి: బాబా ఆరాధనోత్సవాల శుక్రవారం ప్రారంభమయ్యాయి, ఈ సందర్భంగా నారాయణ సేవ తదితర వంటి కార్యక్రమాలు పుట్టపర్తిలోని హిల్ యు స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇందులో పాల్గొనేందుకు వివిఐపి ,వీఐపీలు వస్తున్న సందర్భంగా సమస్యలు తలెత్తకుండా డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంచి జాగ్రత్తలు చేపట్టారు.ఎటువంటి సంఘటనలు తలెత్తకుండా భద్రతాపరమైన ఏర్పాట్లు చేపట్టారు.భక్తులు ,ప్రజలు పెద్ద సంఖ్యలో రానున్నడంతో. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలతో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు పుట్టపర్తి పట్టణం లో ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు తదితర సున్నిత ప్రాంతాలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయబడింది. గుంపుల నియంత్రణ, ట్రాఫిక్ సజావుగా సాగడం, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈ డ్రోన్ నిఘాను ఉపయోగించారు. పోలీస్ అధికారులు ప్రత్యేక పోలీస్ బందోబస్తు, మహిళా పోలీస్ సిబ్బంది, మోహరించారు.

MARUTHI, PUTTAPARTHI RURAL

MARUTHI, PUTTAPARTHI RURAL

Next Story