Dharmavaram: టెన్త్ టాపర్లకు మంత్రి సత్యకుమార్ భరోసా!

Dharmavaram: పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ధర్మవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్ కాల్ ద్వారా అభినందించారు.

PAMALA NAGENDRA, DHARMAVARAM
Published on: 1 May 2026 2:22 PM IST
Dharmavaram
X

Dharmavaram: టెన్త్ టాపర్లకు మంత్రి సత్యకుమార్ భరోసా!

Dharmavaram: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఘనవిజయం - వర్చువల్ కాల్ ద్వారా విద్యార్థులను అభినందించిన మంత్రి సత్య కుమార్ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించిన మన ధర్మవరం నియోజకవర్గ విద్యార్థులతో గౌరవ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు విజయవాడ నుండి వర్చువల్ కాల్ ద్వారా ముచ్చటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ప్రైవేటుకు దీటుగా మంచి మార్కులు సాధించిన విద్యార్థులను చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని మంత్రి గారు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో మరియు వారి తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడిన మంత్రి గారు, వారి భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. చదువు పట్ల విద్యార్థులు చూపిస్తున్న శ్రద్ధను, వారికి అండగా ఉంటున్న తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఉన్నత చదువుల విషయంలో విద్యార్థులకు ఎటువంటి సహాయం కావాలన్నా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా ఐఏఎస్ (IAS), ఐపిఎస్ (IPS) చదవాలని ఆసక్తి ఉండి, ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడే విద్యార్థుల కోసం తన సంస్కృతి సేవా సమితి తరపున ఉచిత శిక్షణతో పాటు బోర్డింగ్ సదుపాయాలను కూడా కల్పిస్తున్న విషయాన్ని మంత్రి గారు ఈ సందర్భంగా గుర్తుచేశారు.

భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకునే విద్యార్థులందరికీ, తాను "తమ ఇంటి బిడ్డలా" ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని మంత్రి గారు ఎంతో ఆత్మీయంగా భరోసా ఇచ్చారు. లక్ష్య సాధనలో మీకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతానని హామీ ఇస్తూ, విద్యార్థులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.

PAMALA NAGENDRA, DHARMAVARAM

PAMALA NAGENDRA, DHARMAVARAM

Next Story