Anantapur: కురిసిన వర్షం – హర్షం వ్యక్తం చేసిన రైతులు

Anantapur: ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న అనంతపురం నగరంలో సోమవారం సాయంత్రం 2 గంటల పాటు మోస్తరు నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 24 Aug 2026 8:44 PM IST
Anantapur
X

Anantapur: కురిసిన వర్షం – హర్షం వ్యక్తం చేసిన రైతులు

అనంతపురం: అనంతపురం జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఇవాళ కురిసిన వర్షంతో ప్రజలు, రైతులకు కాస్త ఉపశమనం లభించింది.

గత కొంతకాలంగా సరైన వర్షాలు లేకపోవడంతో నగరవాసులతో పాటు రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.అయితే ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు అనంతపురం నగరంలో మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

దాదాపు రెండు గంటల పాటు కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది.వర్షం కురవడంతో నగరవాసులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో మరిన్ని వర్షాలు కురిసి పంటలకు, భూగర్భ జలాలకు మేలు జరగాలని రైతులు ఆశిస్తున్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story