Rayadurgam: రాయదుర్గంలో పిచ్చికుక్క స్వైరవిహారం 30 మందికి తీవ్ర గాయాలు!
Rayadurgam: అనంతపురం జిల్లా రాయదుర్గంలో పిచ్చికుక్క దాడిలో 30 మందికి గాయాలు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు.
Rayadurgam: రాయదుర్గంలో పిచ్చికుక్క స్వైరవిహారం 30 మందికి తీవ్ర గాయాలు!
రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో పిచ్చికుక్కకలకలం రేపింది. పట్టణంలోని బళ్లారి రోడ్డు, ఓబులాచారి రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఒకే ఒక్క పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ఏకంగా 30 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
రోడ్డుపై వెళ్తున్న వారిని టార్గెట్ చేస్తూ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కనిపించిన ప్రతి ఒక్కరిపై విరుచుకుపడింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీశారు. గాయపడిన వారందరినీ వెంటనే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందుతోంది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘోరానికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి కాలనీలోనూ కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నా, అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, వారి నిర్లక్ష్యమే ఇప్పుడు ప్రజలకు శాపంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పట్టణంలో కుక్కల బెడదను నివారించాలని డిమాండ్ చేస్తున్నారు.




