Anantapur: వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్‌పై తెలుగు మహిళల తీవ్ర ఆగ్రహం!
Anantapur: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Anantapur: వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్‌పై తెలుగు మహిళల తీవ్ర ఆగ్రహం!
Anantapur: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై అనంతపురం అర్బన్ తెలుగు మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్నాథ్ వైఖరికి నిరసనగా రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు.
అనంతపురం నగరంలోని రాంనగర్ సర్కిల్ వద్ద తెలుగు మహిళలు వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేశారు. మాజీ మంత్రి అమర్నాథ్ ఫోటోలపై ‘గుడ్డు మంత్రి’ అని రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అంతేకాకుండా, ఆయన ఫోటోలపై కోడిగుడ్లతో దాడి చేసి అమర్నాథ్ ఫోటో ఉన్న ఫ్లెక్సీలను దహనం చేశారు.
వారు మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సభ్యత, సంస్కారం అన్నవి అసలు లేవంటూ మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళలను ఇలాగే నీచంగా మాట్లాడుతూ అవమానించారని గుర్తు చేశారు. ఒక రాష్ట్ర హోం శాఖ మంత్రిగా, అందునా ఒక దళిత మహిళగా ఉన్న వంగలపూడి అనితపై అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని ధ్వజమెత్తారు.మహిళల శరీర ఆకృతి, వస్త్రధారణ, వారి క్యారెక్టర్ గురించి మాట్లాడటం వైసిపి నాయకులకు మొదటి నుంచి అలవాటుగా మారింది.
ఒక బాధ్యతాయుతమైన హోంశాఖ మంత్రి గురించి ఇలా మాట్లాడారంటే, ఈ 'గొడ్డలి పార్టీ' నాయకులకు ఎంత అహంకారమో అర్థమవుతోంది.అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్రంలోని మహిళలంతా తీవ్ర ఆవేదన చెందుతున్నారని.. ఆయన వెంటనే హోంశాఖ మంత్రి అనితకు, రాష్ట్ర మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే, రాబోయే రోజుల్లో తెలుగు మహిళలు తిరగబడి, ఆయన్ని తరిమి తరిమి కొట్టడం ఖాయమని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.




