Penukonda: పెనుకొండలో మహిళలు, బాలబాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం
Penukonda: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మహిళలు, బాలబాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Penukonda: పెనుకొండలో మహిళలు, బాలబాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం
శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండలోని భువన విజయం భవనంలో మహిళలు, బాలబాలికల భద్రతపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ అంకితా సురానా, ఆర్డీఓ ఆనంద్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు విద్యార్థులు, మహిళలతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళలు, బాలబాలికల భద్రతపై నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.
బాలబాలికలపై జరిగే వేధింపులు, మహిళలపై దౌర్జన్యాలు, బాల్య వివాహాల నివారణపై సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పోలీసులు అవగాహన కల్పించారు.
బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా అదనపు ఎస్పీ అంకితా సురానా మాట్లాడుతూ.. ప్రజల్లో ముఖ్యంగా బాల్య వివాహాలపై మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళలు, బాలబాలికలపై దౌర్జన్యాలు లేదా ఇతర వేధింపులు జరిగినప్పుడు వెంటనే 112కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.




