Puttaparthi: ఇంటి పన్నుపై రాయితీ.. పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలు మే 31వ తేదీ లోపు ఇంటి పన్ను చెల్లించి 5 శాతం రాయితీని పొందాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కోరారు.
Puttaparthi: ఇంటి పన్నుపై రాయితీ.. పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
Puttaparthi: కలెక్టర్ ఛాంబర్ నందు గ్రామీణ ప్రజలు తమ ఇంటి పన్నును సకాలంలో చెల్లించి ప్రభుత్వం కల్పిస్తున్న 5% రాయితీనిసద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కోరారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను సోమవారం ఆయన ఆవిష్కరించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మే 31 లోపు పన్ను చెల్లించే వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది.
ఈ 5% తగ్గింపు కేవలం ప్రస్తుత సంవత్సర పన్నుకు మాత్రమే. పాత బాకీలకు లేదా యూజర్ ఛార్జీలకు వర్తించదు. ప్రజలు పంచాయతీ కార్యాలయాలకు వెళ్లకుండానే స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో పన్ను చెల్లించి వెంటనే రసీదు పొందవచ్చు.
ఇప్పటికే యజమానుల మొబైల్ నెంబర్లకు డిమాండ్ నోటీసులు పంపబడ్డాయి.గతంలో కేవలం మున్సిపాలిటీలకే పరిమితమైన ఈ వెసులుబాటును ఇప్పుడు గ్రామ పంచాయతీలకు కూడా ప్రభుత్వం విస్తరించిందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాలని కలెక్టర్ గారు తెలియజేశారు.




