Parigi: పరిగి శ్రీ వెంకటేశ్వర ఆలయానికి రూ.86.40 లక్షల నిధులు మంజూరు

Parigi: పరిగి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.86.40 లక్షల సీఎఫ్‌జీ నిధులు విడుదల. మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపిన మండల నాయకులు.

K.UDAY BHANU, PENUKONDA
Published on: 13 Aug 2026 7:55 PM IST
Parigi
X

Parigi: పరిగి శ్రీ వెంకటేశ్వర ఆలయానికి రూ.86.40 లక్షల నిధులు మంజూరు

పరిగి: పరిగి మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గణనీయమైన ఆర్థిక సహాయం మంజూరైంది. ఆలయ పునర్నిర్మాణ పనులకు మొత్తం రూ.1.08 కోట్ల అంచనా వ్యయంలో భాగంగా రూ.86.40 లక్షల సీఎఫ్‌జీ (C.G.F.) నిధులను మంజూరు చేస్తూ ఎండోమెంట్స్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిధులు మంజూరు చేయడంలో ప్రత్యేక చొరవ చూపిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత గారికి పరిగి మండల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.

ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పరిగి మండలంలోని ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం మరింత సహకారం అందించాలని వారు కోరారు.ఆలయ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు కావడం పట్ల భక్తులు, ఆలయ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

K.UDAY BHANU, PENUKONDA

K.UDAY BHANU, PENUKONDA

Next Story