Parigi: పరిగిలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ
Parigi: పరిగి పట్టణంలో ఘనంగా నిర్వహించిన బీజేపీ హర్ ఘర్ తిరంగా యాత్ర. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయాలని నాయకుల పిలుపు.
Parigi: పరిగిలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ
పరిగి: పరిగి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. బీజేపీ పరిగి పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ రెడ్డి, పరిగి మండల అధ్యక్షురాలు అనసూయ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో బీజేపీ పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతి కిరణ్ బూనేటి, బీజేపీ నాయకులు వెన్న ఈశ్వరప్పతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జాతీయ జెండాలు చేతబట్టి నాయకులు, కార్యకర్తలు పట్టణంలో ర్యాలీగా ముందుకు సాగుతూ దేశభక్తి నినాదాలతో పరిగి పట్టణాన్ని మార్మోగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… తిరంగా మన దేశ గౌరవానికి ప్రతీక అని, ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి నిండాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని అన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ స్ఫూర్తితో ప్రతి ఇంటా తిరంగా… ప్రతి గుండెలో దేశభక్తి ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రామచంద్రయ్య, రాము యాదవ్, పెంటయ్య గుప్తా, కేశవులు, ముకుంద నాగేశ్వర్, డి. ఆంజనేయులు, పరిగి అసెంబ్లీ కన్వీనర్ ఉగ్ర నరసింహ, పరిగి మండల మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




