Pargi: పరిగిలో విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేసిన అంకిత సంస్థ
Pargi: పరిగి మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు విద్యా సామగ్రి కిట్స్ అందజేసిన అంకిత స్వచ్ఛంద సంస్థ. అభినందించిన మున్సిపల్ కమిషనర్ మల్లేష్ యాదవ్.
Pargi: పరిగిలో విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేసిన అంకిత సంస్థ
పరిగి:పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ అంకిత స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను పరిగి మున్సిపల్ కమిషనర్ కావటి మల్లేష్ యాదవ్ అభినందించారు. పరిగి మున్సిపల్ పరిధిలోని సుల్తాన్‌పూర్, సుల్తాన్‌పూర్ తండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సంస్థ ఆధ్వర్యంలో విద్యా సామగ్రి కిట్స్ పంపిణీ చేశారు.
బ్యాగులు, మ్యాట్లు, చెప్పులతో కూడిన కిట్స్‌ను పరిగి మున్సిపల్ కమిషనర్ కావటి మల్లేష్ యాదవ్, స్థానిక కౌన్సిలర్ తుమ్మలబావి సునీత శశాంక్ రెడ్డి, సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాష్ కుమార్ కలిసి విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ కావటి మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ… విద్యార్థి దశ భవిష్యత్తుకు పునాది వంటిదని, క్రమశిక్షణతో చదువుకుంటూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించడం ద్వారా చదువుపై ఆసక్తిని పెంచేందుకు అంకిత సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉంటారని, వారిని దృష్టిలో ఉంచుకుని వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు.




