Pamidi: పామిడిలో ముసాయిదా ఓటర్ల జాబితాపై ప్రత్యేక గ్రామ సభ!
Pamidi: అనంతపురం జిల్లా పామిడి మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల 2026 నిమిత్తం ముసాయిదా ఓటర్ల జాబితాపై ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు.
Pamidi: పామిడిలో ముసాయిదా ఓటర్ల జాబితాపై ప్రత్యేక గ్రామ సభ!
అనంతపురం జిల్లా: పామిడి గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు-2026 కు సంబంధించి SC, ST, BC ముసాయిదా ఓటర్ల జాబితాపై పామిడి మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు.
పంచాయతీ కార్యదర్శి శివమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రామ సభకు అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు, సవరణలు ఉంటే తెలపాలని ఈ సభ ముఖ్య ఉద్దేశమని కార్యదర్శి తెలిపారు.
ఈ గ్రామ సభలో పామిడి మండల జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ ఎం. ధనుంజయ.. తెదేపా మండల కన్వీనర్ బొమ్మ మోహన్. కుమార్ తదితరులు నాయకులు పాల్గొని ఓటర్ల జాబితాను పరిశీలించారు. రిజర్వేషన్ల జాబితాలో అవకతవకలు లేకుండా పారదర్శకంగా ఉండేలా చూడాలని, అర్హులైన వారందరికీ న్యాయం జరిగేలా జాబితాను రూపొందించాలని రాజకీయ పార్టీ నాయకులు సూచించారు.
ఓటర్ల జాబితాలో తప్పులు, అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని అధికారులు తెలిపారు.




