Pamidi: ఖేల్‌కుద్ క్రీడల్లో పామిడి సరస్వతి విద్యామందిరం విద్యార్థుల ఘన విజయం
Pamidi: పామిడి సరస్వతి విద్యామందిరం విద్యార్థులు ఖేల్‌కుద్ జిల్లా, జోనల్ స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించారు. మెడల్స్ ప్రదానం చేసిన పాఠశాల యాజమాన్యం.
Pamidi: ఖేల్‌కుద్ క్రీడల్లో పామిడి సరస్వతి విద్యామందిరం విద్యార్థుల ఘన విజయం
Pamidi: అనంతపురం జిల్లా పామిడి మండలం నిట్టూరు నిలయం లోని సరస్వతి విద్యామందిరం ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు.ఈ పాఠశాలకు చెందిన దిలీప్ కుమార్, రీతిక్, శ్రీముఖి అనే ముగ్గురు విద్యార్థులు పరుగు పందెంలో 200 మీ, 400 మీ విభాగాల్లో ప్రథమ స్థానం సాధించారు.
సరస్వతీ విద్యాపీఠం ప్రతి సంవత్సరం నిర్వహించే ఖేల్‌కుద్ క్రీడా పోటీల్లో వీరు ముగ్గురు జిల్లా స్థాయి పోటీల్లో, అనంతరం రాయలసీమ జోన్ స్థాయి పోటీల్లో కూడా పాల్గొని రెండింటిలోనూ మొదటి స్థానం కైవసం చేసుకున్నారు.
వీరి విజయాన్ని అభినందిస్తూ పాఠశాల యాజమాన్యం తరపున ఉపాధ్యక్షులు శ్రీ బొల్లు శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి శ్రీ బసవరాజు, శ్రీమతి తులసిబాయి విద్యార్థులకు మెడల్స్ బహుకరించి ప్రశంసించారు.
విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని వారు విద్యార్థులకు సూచించారు.




