Pamidi: పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు.. కూటమి నేతల కేక్ కటింగ్!

Pamidi: అనంతపురం జిల్లా పామిడిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్ చేసి పేదలకు పాలు, బ్రెడ్లు పంపిణీ చేసిన కూటమి నాయకులు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 2 Sept 2026 3:17 PM IST
Pamidi
X

Pamidi: పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు.. కూటమి నేతల కేక్ కటింగ్!

Pamidi: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పామిడి పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

పట్టణంలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో కూటమి నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి, పేదలకు పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ.. "పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఉపయోగపడే గొప్ప నాయకుడు. ఎనిమిదేళ్లు పార్టీని నడిపి, ఓటమి చెందినా అధైర్యపడకుండా విమర్శలనే ఆయుధంగా మలచుకుని రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా నీళ్లు అందించిన ఘనత పవన్ కళ్యాణ్ దే. ఆయన కృషిని మరువలేం" అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభాకర్ చౌదరి, బి. శ్రీనివాసులు రెడ్డి, గౌస్ పీరా, జింకల సంజీవ, వడ్డే రాము, కత్రిమల సుబ్బు, దాదా, కలందర్, జమీర్, సూర్య, షేక్షావలి, అంజి నాయక్, పవన్ కుమార్, రైజింగ్ రాజశేఖర్, శ్రీరాములు, టి.టి. రామన్, కొట్టం మాలిక్, బాబావలి తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story