Pamidi: వినాయక చవితి వేడుకలకు పోలీసుల ఆంక్షలు పామిడి సీఐ కీలక సూచనలు!
Pamidi: అనంతపురం జిల్లా పామిడిలో వినాయక చవితి మండపాల నిర్వహణపై సీఐ శివశంకర్ నాయక్ కీలక మార్గదర్శకాలు విడుదల చేశారు. డీజేలపై నిషేధం, పోలీస్ అనుమతి తప్పనిసరి.
Pamidi: వినాయక చవితి వేడుకలకు పోలీసుల ఆంక్షలు పామిడి సీఐ కీలక సూచనలు!
Pamidi: అనంతపురం జిల్లా పామిడి పట్టణ మరియు మండల ప్రజలకు పామిడి సీఐ శివశంకర్ నాయక్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల నిర్వహణ, విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాల్లో ప్రజలు, ఉత్సవ కమిటీలు తప్పనిసరిగా పోలీసు శాఖ నిబంధనలు పాటించాలని సీఐ తెలిపారు.
సీఐ తెలిపిన నిబంధనలు:
వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రతి మండప నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ లో అనుమతి తీసుకోవాలి.
రోడ్లకు, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా మండపాలు ఏర్పాటు చేయాలి.
ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మైకులు, సౌండ్ సిస్టమ్ వాడాలి. రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సౌండ్ వాడరాదు.
డీజేలు, భారీ సౌండ్ సిస్టమ్ లకు అనుమతి లేదు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 100 డెసిబుల్స్ కు మించి సౌండ్ ఉండకూడదు.
విద్యుత్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి.
మండపాల వద్ద 24 గంటలు నిర్వాహకులు నిఘా ఉంచాలి. అసాంఘిక కార్యకలాపాలకు తావు ఇవ్వకూడదు.
నిమజ్జన ఊరేగింపుకు ముందుగా పోలీసు అనుమతి తీసుకోవాలి. నిమజ్జనానికి నిర్దేశించిన ప్రదేశంలోనే నిమజ్జనం చేయాలి.
ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు, సంఘటనలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం కోసం 100 లేదా పామిడి పోలీస్ స్టేషన్ నెంబర్ 9989819191 కు కాల్ చేయాలని సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు.
పండుగను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.




