Pamidhi: పామిడిలో పాండురంగస్వామి ఆషాడ బ్రహ్మోత్సవాలు.. హనుమద్‌వాహన సేవ

Pamidhi: పామిడి శ్రీ రుక్మిణి సమేత పాండురంగస్వామి ఆషాడ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు హనుమద్ వాహనంపై దర్శనమిచ్చారు. మరాఠీ అబంగాలు, సన్నాయి వాయిద్యాలు మారుమోగాయి.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 26 July 2026 4:29 PM IST
Pamidhi
X

Pamidhi: పామిడిలో పాండురంగస్వామి ఆషాడ బ్రహ్మోత్సవాలు.. హనుమద్‌వాహన సేవ

పామిడిలో: హనుమద్ వాహనంపై పాండురంగస్వామి దర్శనం

- సన్నాయి, అబంగాలతో భక్తి శోభ

అనంతపురం జిల్లా పామిడి రుక్మిణి సమేత పాండురంగస్వామి ఆలయంలో ఆషాడ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారు హనుమద్ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భగవాన్ దాస్ రంగసుభే ఫిర్కా పాండురంగస్వామి ఆలయం నుండి ఊరేగింపు ప్రారంభమై పుర వీధుల గుండా సాగింది.

ఊరేగింపులో సన్నాయి వాయిద్యాలు, మరాఠి అబంగాలు - కీర్తనలు ఆలపిస్తూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగారు. మహిళలు కుంకుమ పూజలు చేసి స్వామి వారికి హారతులు సమర్పించారు.

వీధుల వెంబడి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఆలయ ప్రాంగణం గోవింద నామాలతో మారుమోగింది.

ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో కృష్ణయ్య, అధ్యక్షులు నాగభూషణరావు గార్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story