Pamidi: యాదవ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
Pamidi: పామిడిలో యాదవ సంఘం అధ్యక్షులు జి. మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.
Pamidi: యాదవ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
పామిడి: పామిడి పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. మండల యాదవ సంఘం అధ్యక్షుడు జి.మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో యాదవ కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పట్టణంలోని పాండురంగ దేవాలయంలో పాండురంగ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
పాండురంగ ఆలయం నుంచి భారీ ర్యాలీ
పూజల అనంతరం పాండురంగ ఆలయం నుంచి ఫారెస్ట్ బంగ్లా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కాలనీల మీదుగా బాణాసంచా పేలుస్తూ ర్యాలీ కొనసాగింది. యాదవ సోదరులు సంప్రదాయ దుస్తులు, తలపాగాలతో ప్రత్యేక అలంకరణలో పాల్గొని ఆకర్షణగా నిలిచారు.
భజనలు, గురవయ్యల నృత్యాలు ఆకర్షణ
ర్యాలీలో చక్క భజనలు, దేవుని పాటలు ఆలపిస్తూ భక్తులు ముందుకు సాగారు. భజన బృందాల ప్రదర్శనలు, గురవయ్యల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డీజే పాటలకు యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు రామకృష్ణ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఓబిలేసు యాదవ్, రామాంజినేయులు యాదవ్, రంగస్వామి యాదవ్, ప్రభాకర్ యాదవ్, గోపాల్ యాదవ్, తెలుగుదేశం పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్మిక శాఖ బోర్డు చైర్మన్ వెంకటశివ యాదవ్ తదితరులు పాల్గొని భజనల్లో, నృత్యాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
శ్రీకృష్ణుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పామిడి ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ యాదవ సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.




