Pamidi: పామిడి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారి!

Pamidi: అనంతపురం జిల్లా పామిడి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వెంకటేశ్వర్లు రావు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 12 Sept 2026 1:47 PM IST
Pamidi
X

Pamidi: పామిడి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారి!

Pamidi: అనంతపురం జిల్లా పామిడి సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వెంకటేశ్వర్లు రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత, పారిశుద్ధ్యం తదితర అంశాలను ఆయన పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగుల పట్ల, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిబ్బందిపై తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL