Anantapur: అమ్మఒడి కోసం కలెక్టరేట్‌కు అనాథ చిన్నారి!
Anantapur: అనంతపురం కలెక్టరేట్లో ఒంటరిగా అనాథ బాలిక అర్జీ. అమ్మఒడి సహాయం అందించాలని మంత్రి నారా లోకేష్, కలెక్టర్‌ను కోరిన బ్రహ్మసముద్రం మండల చిన్నారి.
Anantapur: అమ్మఒడి కోసం కలెక్టరేట్‌కు అనాథ చిన్నారి!
అనంతపురం జిల్లా:
అమ్మఒడి కోసం అనంతపురం కలెక్టరేట్ బాట పట్టిన అనాథ బాలిక
అనంతపురం జిల్లాలో ఓ అనాథ బాలిక తనకు రావాల్సిన అమ్మఒడి సాయం కోసం ఒంటరిగానే కలెక్టరేట్‌కు వచ్చి అర్జీ సమర్పించడం స్థానికంగా కలచివేసింది.
వివరాల్లోకి వెళ్తే...
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం, బ్రహ్మసముద్రం మండలంలోని బ్రిడ్జి స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్నటువంటి కీర్తి బాయ్ అనే అనాథ బాలిక కావటంతో తనకు రావాల్సిన అమ్మఒడి పథకం సాయం అందకపోవడంతో ఆ బాలిక ఆవేదనకు గురైంది. తల్లిదండ్రులు లేకపోవడం, తమ సమస్యను అడిగే దిక్కు ఎవరూ లేకపోవడంతో ఆ చిన్నారి ధైర్యంగా ఒంటరిగానే అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని అధికారులకు వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా బాలిక మీడియా ముందు తన బాధను వెళ్లబోసుకుంది. తనకు తల్లిదండ్రులు లేరని, పట్టించుకునే వారు ఎవరూ లేకపోవడం వల్లే స్వయంగా కలెక్టరేట్‌కు రావాల్సి వచ్చిందని కీర్తి బాయ్ తెలిపింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రత్యేక దృష్టి సారించి, తనకు అమ్మఒడి పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని, తన చదువుకు ఆసరాగా నిలవాలని ఆ చిన్నారి వేడుకుంది.
బైట్: కీర్తి బాయ్




