Anantapur: అనంతపురం 'ధూమ్' స్టైల్ దొంగ అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం

Anantapur: షాపింగ్ మాల్స్‌ను టార్గెట్ చేసి 5 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్న నాగరాజు అరెస్ట్. 33 కేసులు ఉన్న దొంగ నుంచి రూ.5.25 లక్షలు, కారు, పనిముట్లు స్వాధీనం.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 10 July 2026 2:46 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురం 'ధూమ్' స్టైల్ దొంగ అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం

అనంతపూర్: ధూమ్ సినిమా తరహాలో షాపింగ్ మాల్స్ లో దొంగతనాలకు పాల్పడే దొంగను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి దొంగతనానికి ఉపయోగించే ఇనుపరాడ్లను, కట్టర్లను, ఓ కారు తో పాటు 3 నంబర్ ప్లేట్లను, ఐదు లక్షల 25 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పి మహబూబ్ బాషా డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

బెంగళూరు సి ఎస్ ఆర్ పాల్యం ప్రాంతానికి చెందిన నాగరాజు గారి ఆనంద్ షాపింగ్ మాల్స్ ని టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు గత ఐదేళ్లుగా పాల్పడుతున్నాడు.

ఇళ్లలో దొంగతనం చేస్తే కష్టపడి సంపాదించిన సొమ్ము పోతే పేదవాళ్లు బాధపడతారని భావించిన దొంగ ధూమ్ సినిమా తరహాలో షాపింగ్ మాల్స్ లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెళ్లడైందన్నారు. ఇతనిపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో దాదాపు 33 కేసులు ఉన్నట్లు తెలిసిందన్నారు. గత నెల 27న అనంతపురంలోని డ్రెస్ సర్కిల్లో దొంగతనం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టి, ఒకటో పట్టణ పోలీ.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story